logo

ప్రభుత్వ విద్యతోనే బంగారు భవిష్యత్తు

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందనీ జడ్పీ ఛైర్‌ పర్సన్ సరిత అన్నారు.

Published : 15 Jun 2024 13:43 IST

రాజోలి: ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందనీ జడ్పీ ఛైర్‌ పర్సన్ సరిత అన్నారు. ఆమె శనివారం గద్వాల పట్టణంలోని 16వ వార్డ్ లోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు మున్సిపల్ ఛైర్మన్ కేశవతో కలసి మెమోంటో అందించి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ఇక్కడ నాణ్యమైన విద్య అందుతోదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తోందన్నారు.  కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నర్సింహులు, మహేష్, టి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని