logo

Mahbubnagar: ఉరేసుకొని వ్యక్తి మృతి

ఉండవల్లి మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లో ఉరి వేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

Updated : 22 Jun 2024 19:56 IST

రాజోలి: ఉండవల్లి మండల పరిధిలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లో ఉరి వేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ముడుమాలగుర్తి గ్రామానికి చెందిన గొల్ల మల్లిఖార్జున్(41) తపాలా కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం ఆయన వ్యక్తిగత కారణాలతో జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఈయన ఉద్యోగరిత్యా కర్నూలు పట్టణంలోని వెంకటరమణ కాలనీలో కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ ఐ శ్రీనివాసులు, మృతదేహాన్ని కర్నూలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని