logo

నెలాఖరులోగా మనబడి పనులు పూర్తి చేయాలి

మన ఊరు - మన బడి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసి ఎఫ్‌టీవోలు అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గురువారం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, డీపీవో సిబ్బందితో మన బడి పనులపై సమీక్షించారు.

Updated : 24 Mar 2023 06:34 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష, చిత్రంలో అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌

నారాయణపేట, న్యూస్‌టుడే : మన ఊరు - మన బడి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేసి ఎఫ్‌టీవోలు అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. గురువారం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, డీపీవో సిబ్బందితో మన బడి పనులపై సమీక్షించారు. ఆయుష్మాన్‌ భారత్‌కు జిల్లా నుంచి 59 ఆరోగ్య ఉపకేంద్రాలు గుర్తించారని, వాటిలో కేంద్ర పభుత్వం సూచించిన నిబంధనల మేరకు పెయింటింగ్‌, బొమ్మలు, ఎథనిక్‌ డిజైన్‌ లోగో వేసి అందుకు సంబంధించిన ఫొటోలు వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేస్తే నిధులు విడుదల అవుతాయన్నారు. వాటిని రేపు సాయంత్రంలోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. జిల్లాలో మెటీరియల్‌ కాంపోనెంట్ కింద మంజూరైన సీసీ రోడ్లను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. పంచాయతీరాజ్‌ రోడ్లపై సమీక్షించారు. అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిత్తల్‌, డీపీవో మురళి, పీఆర్‌ ఈఈ నరేందర్‌, డీఈఈ మంగులాల్‌, ఏఈలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే   ప్రసవాలు అయ్యేలా చూడాలి..

నారాయణపేట : గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు అయ్యేలా చూడాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మక్తల్‌, కృష్ణా, మాగనూరు మండలాల్లోని గర్భిణులు రాయచూరు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని నివారించడానికి ఏప్రిల్‌ 1 నుంచి మక్తల్‌ మండల కేంద్రంలోనే కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాధారణ ప్రసవాలతోపాటు అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్‌ చేయడానికి సుశిక్షితులైన వైద్యులు, స్టాఫ్‌నర్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా, ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని