logo

సిబ్బంది తప్పిదంతో రూ.21 కోట్ల విద్యుత్తు బిల్లు

రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలుచేస్తుంటే, విద్యుత్తు సిబ్బంది తప్పిదంతో ఓ ఇంటికి ఏకంగా రూ. 21 కోట్ల బిల్లు వచ్చిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది.

Updated : 13 Jun 2024 05:42 IST

రూ.21 కోట్ల బిల్లు వచ్చిన రశీదు 

బిజినేపల్లి, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలుచేస్తుంటే, విద్యుత్తు సిబ్బంది తప్పిదంతో ఓ ఇంటికి ఏకంగా రూ. 21 కోట్ల బిల్లు వచ్చిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన వేమారెడ్డి ఇంటికి ఏర్పాటు చేసిన విద్యుత్తు మీటరుకు విద్యుత్తు శాఖ సిబ్బంది ఈ నెల 5న రీడింగ్‌ నమోదు చేయగా రూ. 21 కోట్ల 47 లక్షల బిల్లు వచ్చింది. దీంతో వేమారెడ్డి కంగారుపడి విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బిల్లులు నమోదు చేసిన వ్యక్తికి అవగాహన లేకపోవడంతో 1970 నుంచి 2024 జూన్‌ 5 వరకు రీడింగ్‌కు సంబంధించిన బిల్లు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ లైన్‌మన్‌ విధులకు సక్రమంగా రాకుండా, ప్రైవేట్‌ వ్యక్తితో బిల్లులు నమోదు చేయించడం ద్వారానే ఇటువంటి తప్పులు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సంఘటనపై విద్యుత్తు శాఖ ఏఈ మహేశ్‌ని వివరణ కోరగా.. బిల్లు అధికంగా వచ్చిన మాట వాస్తవమేనని సరిచేయిస్తామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని