logo

అచ్చంపేట పురపాలికలో నెగ్గిన అవిశ్వాసం

అచ్చంపేట పురపాలికలో అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పుర ఛైర్మన్‌ నర్సింహగౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ద్వారా తొలిగించేలా చర్యలు చేపట్టాలని 13 మంది కౌన్సిల్‌ సభ్యులు మే 25న జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

Published : 13 Jun 2024 03:38 IST

ఛైర్మన్‌ పదవి భారాస నుంచి కాంగ్రెస్‌ కైవసం 

చెయ్యెత్తిన కౌన్సిల్‌ సభ్యులు, ఎమ్మెల్యే వంశీకృష్ణ 

అచ్చంపేట న్యూటౌన్, న్యూస్‌టుడే : అచ్చంపేట పురపాలికలో అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పుర ఛైర్మన్‌ నర్సింహగౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ద్వారా తొలిగించేలా చర్యలు చేపట్టాలని 13 మంది కౌన్సిల్‌ సభ్యులు మే 25న జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆర్డీవో మాధవి ఆధ్వర్యంలో మే 27న పురపాలికలోని 20 మంది కౌన్సిల్‌ సభ్యులు అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాలని సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పుర కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పురపాలిక పరిధిలోని 20 మంది సభ్యులకు గాను శైలజ, గౌరీశంకర్, నిర్మల, సోమ్లా, మెహరాజ్‌బేగం, లావణ్య, రమేశ్, నూరిబేగం, చిట్టెమ్మ, సుగుణమ్మ, సునీత, సంధ్య, శివకృష్ణ, శ్రీనువాసులు, శ్రీను, శివతో పాటు ఎక్స్‌అఫీషియో ఓటరుగా ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ మొత్తం 17 మంది స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. భారాసకు చెందిన నలుగురు కౌన్సిలర్లు నర్సింహగౌడ్, ఖాజాబీ, మనోహర్‌ప్రసాద్, రమేశ్‌రావు గైర్హాజరయ్యారు. దీంతో భారాస నేతలు ఈ నెల 11న విప్‌ జారీ చేస్తున్నట్లు దరఖాస్తు చేసినప్పటికి సకాలంలో ఇవ్వకపోవడంతో చెల్లదని ఆమె స్పష్టం చేశారు. నూతన ఛైర్మన్‌ ఎన్నికను ఉన్నతాధికారుల అనుమతులతో నిబంధనల ప్రకారం ఎన్నుకోనున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కమిషనర్‌ శ్యామ్‌సుందర్, ఉప తహసీల్దార్‌ రాములు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని