logo

మద్దూరులో ఆగంతకుడి హల్‌చల్‌

మద్దూరు పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి వికృత చేష్టలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఊరికి చివరన ఉన్న ఇళ్ల సమీపంలో బట్టలు లేకుండా తిరుగుతుండటంతో నివాసితులు విషయాన్ని పోలీసులకు చెప్పారు.

Updated : 11 Jul 2024 06:02 IST

మద్దూరు, న్యూస్‌టుడే: మద్దూరు పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి వికృత చేష్టలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఊరికి చివరన ఉన్న ఇళ్ల సమీపంలో బట్టలు లేకుండా తిరుగుతుండటంతో నివాసితులు విషయాన్ని పోలీసులకు చెప్పారు. రోజూ కాకుండా అప్పుడప్పుడు రాత్రివేళల్లో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఇటీవల వసతి గృహంలోకి రాత్రి 12 గంటల తర్వాత ఒంటిపై బట్టలు లేకుండా ముఖానికి తెల్లని వస్త్రం చుట్టుకుని చొరబడి 45 నిమిషల పాటు తిరిగాడు. విద్యార్థులు లేచి అరవటంతో గేటు దూకి పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. వసతి గృహం అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి తరువాత ఇళ్ల తలుపులు కొట్టడం, తెరిచి చూసేసరికి ఎవరూ కనిపించకపోవడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో పోలీసులు నిఘా పెంచారు. యువకులు రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారు. రాత్రి 10గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని ఎస్‌ఐ సామాజిక మాధ్యమాల్లో పోస్టుపెట్టారు. కొత్తవ్యక్తుల సంచారంపై నిఘా ఉంచామన్నారు. ఈ ఘటనలపై ఎస్‌ఐ రామ్‌లాల్‌తో ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా వసతి గృహంలో గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై బట్టలు లేకుండా తిరిగినట్లు సీసీ ఫుటేజీలో ఉందన్నారు. దీని ఆధారంగా కొందరు అనుమానితులను విచారిస్తున్నామన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని