logo

Mahbubnagar: కార్మికుల సమస్యలు తెలుసుకున్న ప్రతినిధులు

రాజోలిలో చేనేత మగ్గాలు నేస్తున్న కార్మికుల సమస్యలను పీడీ అగర్వాల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు.

Published : 22 Jun 2024 19:53 IST

రాజోలి: రాజోలిలో చేనేత మగ్గాలు నేస్తున్న కార్మికుల సమస్యలను పీడీ అగర్వాల్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. 2009 వరదల్లో నష్టపోయిన చేనేత కార్మికులు మగ్గాలు వేసుకోవడానికి వీలుగా ఆ సంస్థ వారు రెండు వర్క్ షెడ్ల నిర్మాణం చేపట్టారు. 12 సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు అక్కడ మగ్గాలు నేస్తుండటంతో.. శనివారం సంస్థ ప్రతినిధులు ఉపేంద్ర అగర్వాల్, డా.సుధాకర్, స్వరూప్ గ్రామానికి వచ్చి షెడ్‌ను పరిశీలించడంతో పాటు, సమస్యలను తెలుసుకున్నారు. షెడ్డుకు అవసరమైన మరమ్మతులు చేపడతామని, సరిహద్దు వరకు పెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వారు కార్మికులతో అన్నారు. అయితే.. ప్రస్తుతం చీరలకు గిరాఖీలు లేక కూలీ డబ్బులు రావడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారుతోందని కార్మికులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని