logo

Medak: మత్తుమందు తయారీలో నలుగురు అరెస్టు

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో 2.600 కిలో గ్రాముల ఆల్ఫోజలం మత్తుమందును న్యాబ్(NAB) గుమ్మడిదల పోలీసులు, అధికారులు పట్టుకున్నారు.

Updated : 18 Jun 2024 17:20 IST

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో 2.600 కిలో గ్రాముల ఆల్ఫోజలం మత్తుమందును న్యాబ్(NAB) గుమ్మడిదల పోలీసులు, అధికారులు పట్టుకున్నారు. దీనితోపాటు 30 కిలోల ముడి సరుకులు సైతం పట్టుకున్నారు. ఆల్ఫోజలం విలువ 40 లక్షలు, ముడి సరుకు విలువ 60 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఈ మత్తు మందు తయారులో గోస్కొండ అంజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయికుమార్ గౌడ్, రాకేష్ కుమార్‌లు నిందితులుగా ఉన్నారని తెలిపారు. వీరిలో అంజిరెడ్డి, రాకేష్ కుమార్ లను అరెస్టు చేశామని, ప్రభాకర్ గౌడ్ పరారిలో ఉన్నాడని, సాయికుమార్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని