logo

వడగళ్ల వర్షం.. ఇళ్లు ధ్వంసం

మండలంలోని లింగోజి గూడ, రూప్లా తండా, కొత్తపేట, రత్నాపూర్‌ తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది.

Published : 14 Jun 2024 01:09 IST

కొత్తపేటలో కురిసిన వడగళ్లు 

శివ్వంపేట, న్యూస్‌టుడే: మండలంలోని లింగోజి గూడ, రూప్లా తండా, కొత్తపేట, రత్నాపూర్‌ తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో లింగోజిగూడలో కోళ్ల ఫారం కుప్ప కూలి కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇదే గ్రామంలో రైతు దుర్గయ్య గేదెల షెడ్డు రేకులు ఎగిరి పోయాయి. పోతిరెడ్డిపల్లి తండాలో బానవత్‌ లక్ష్మి, బి.కిషన్‌కు చెందిన ఇళ్లపైకప్పు రేకులు ధ్వంసమై సామగ్రి తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
అల్లాదుర్గం, న్యూస్‌టుడే : మండల పరిధి అల్లాదుర్గం బహిరన్‌ దిబ్బ, చేవెళ్ల, చిల్వేర్, కాయిదంపల్లి తదితర గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. గ్రామాల్లోని వీధుల్లో వరద పారింది. విత్తనాలు వేసేందుకు వెళ్లిన రైతులు వర్షంతో ఇబ్బంది పడ్డారు. 


లింగోజి గూడలో కూలిన కోళ్ల ఫారం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని