logo

హత్యాయత్నం, అట్రాసిటీ కేసులో భాజపా మాజీ అధ్యక్షుల రిమాండ్‌

భూతగాదాకు సంబంధించి హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట పట్టణ అధ్యక్షులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి గురువారం రిమాండు విధించారు

Published : 14 Jun 2024 02:04 IST

 

సిద్దిపేట టౌన్, న్యూస్‌టుడే: భూతగాదాకు సంబంధించి హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట పట్టణ అధ్యక్షులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి గురువారం రిమాండు విధించారు. ఇప్పటికే ఈ కేసులో మూడు రోజుల క్రితం ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వన్‌టౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై నరసింహారావుతో కలసి ఏసీపీ మధు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన గరికముక్కు రాజేశ్‌ సిద్దిపేటకు చెందిన అనిత వద్ద రాఘవేంద్రనగర్‌ కాలనీలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే భాజపా జిల్లా మాజీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్, మరో తొమ్మిది మంది వచ్చి ఆ స్థలం తమేదనంటూ రాజేశ్‌ ఇంటి నిర్మాణ గుత్తేదార్లు సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలపై గతంలో దాడికి పాల్పడగా కేసు నమోదైంది. వన్‌టౌన్‌ పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మూడు రోజుల కిందట వల్లెపు పర్శరాములు, అలకుంట ఆనంద్, బొల్లవేన యాదగిరిలను అరెస్టు చేశారు. గురువారం సిద్దిపేటలోని బీజేఆర్‌ చౌరస్తా వద్ద దూది శ్రీకాంత్‌రెడ్డి, పత్రి శ్రీనివాస్, పాతూరి శ్రీనివాస్‌రెడ్డి, శివరాత్రి నగేశ్, చేర్యాల అభిషేక్‌ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ఐదు చరవాణులు, కర్రలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పత్రి నాగరాజు, కొంపెల్లి నాగరాజు, బోదాసు కనకరాజు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని