logo

వ్యవసాయంలో వాతావరణ పాత్ర కీలకం

వ్యవసాయ రంగంలో వాతావరణ పాత్ర చాలా కీలకమైందని, అందుకనుగుణంగా పంటల సాగు సరళిని మార్చినప్పుడే సత్ఫలితాలు సాధ్యమని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ ఆర్‌.ఉమారెడ్డి, రాష్ట్ర వాతావరణ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎస్‌.జి.మహదేవప్ప స్పష్టం చేశారు.

Updated : 16 Jun 2024 05:43 IST

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు ఉమారెడ్డి, ఎస్‌జీ మహదేవప్ప 

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ రంగంలో వాతావరణ పాత్ర చాలా కీలకమైందని, అందుకనుగుణంగా పంటల సాగు సరళిని మార్చినప్పుడే సత్ఫలితాలు సాధ్యమని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ ఆర్‌.ఉమారెడ్డి, రాష్ట్ర వాతావరణ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎస్‌.జి.మహదేవప్ప స్పష్టం చేశారు. శనివారం వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని వాతావరణ పరిశీలనా కేంద్రంలో వివిధ రకాల వాతావరణ మూలకాల పనితీరు, డేటా సేకరణను పరిశీలించారు. అనంతరం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్‌ జిల్లాల పరిధిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు చెందిన సేద్య విభాగ శాస్త్రవేత్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగం, పంటలసాగు విస్తరణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమారెడ్డి. మహదేవప్ప మాట్లాడుతూ.. ప్రధానంగా వాతావరణ మూలకాలైన వర్షపాతం, పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, సూర్యరశ్మి, గాలి వేగం, దశ తదితర వాటి ప్రాముఖ్యతల గురించి వివరించారు. శాస్త్రవేత్తలు ఎం.మధు, నాగభూషణం, భరత్, మాధవి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు