logo

రూ.16,742 కోట్లతో.. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

జిల్లా యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ నివేదికను త్వరలో కలెక్టర్‌ ఆమోదించి ఆవిష్కరించనున్నారు. జిల్లాలో 31 బ్యాంకులున్నాయి. వాటి పరిధిలో 250 శాఖల ద్వారా అన్ని వర్గాల వారికి సేవలు, లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

Published : 18 Jun 2024 02:03 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: జిల్లా యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ నివేదికను త్వరలో కలెక్టర్‌ ఆమోదించి ఆవిష్కరించనున్నారు. జిల్లాలో 31 బ్యాంకులున్నాయి. వాటి పరిధిలో 250 శాఖల ద్వారా అన్ని వర్గాల వారికి సేవలు, లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆయా బ్యాంకుల్లో పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాయి. ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ, విదేశీ చదువులకు వెళ్లే వారిని పోత్సహిస్తున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ సొంతింటి కల సాకారానికి రుణాలు ఇస్తున్నాయి. వీధి వ్యాపారులకు ముద్ర రుణాలు, పీఎంఈజీపీ తదితర రుణాలతో ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాయి. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 16,742.20 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేశారు. గతేడాది రుణ లక్ష్యం 204శాతం లక్ష్యం సాధించడం విశేషం. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేసున్నామని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని