logo

ఆరేళ్లుగా తల్లడిల్లిన తల్లి

ఆరేళ్లుగా తనయుడి కోసం తల్లడిల్లిన తల్లి.. కుమారుడి ఆచూకీ లభించడంతో ఊరట చెందారు. ఉన్నత చదువులకు ఫిలిఫీన్స్‌కు వెళ్లిన వ్యక్తి ఆచూకీ సంగారెడ్డి ఎస్పీ చొరవతో లభ్యమైంది.

Updated : 20 Jun 2024 04:52 IST

ఎస్పీ చొరవతో కుమారుడి ఆచూకీ లభ్యం

అరుణ్‌రెడ్డి 

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: ఆరేళ్లుగా తనయుడి కోసం తల్లడిల్లిన తల్లి.. కుమారుడి ఆచూకీ లభించడంతో ఊరట చెందారు. ఉన్నత చదువులకు ఫిలిఫీన్స్‌కు వెళ్లిన వ్యక్తి ఆచూకీ సంగారెడ్డి ఎస్పీ చొరవతో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు..  కందికి చెందిన సత్యగామ మాణెమ్మ, వెంకట్‌ రాంరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అరుణ్‌రెడ్డి 2012లో ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లారు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసేవారు. 2017, జులై 21న వెంకట్‌ రాంరెడ్డి స్వగ్రామంలో గుండెపోటుతో మరణించారు. అప్పట్లో ఆయన అంత్యక్రియలకు అరుణ్‌రెడ్డి రాలేదు. 2018, నవంబరులో ఇంటికి వచ్చారు. వెంటనే తిరిగి వెళ్లిన ఆయన ఆచూకీ.. ఆరేళ్లుగా లభించలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చేది. మాణెమ్మ ఈ నెల 10న సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్పీ రూపేష్‌ ఫిలిప్పీన్స్‌లో ఎంబసీతో మాట్లాడారు. అరుణ్‌రెడ్డి ఆచూకీ లభించేలా చొరవ తీసుకున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ నెల 16న అర్ధరాత్రి అరుణ్‌కుమార్‌ తల్లికి ఫోన్‌చేశారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. రెండేళ్ల క్రితం పాస్‌పోర్టు పోయిందని, ఈ నేపథ్యంలో ఫోన్‌ చేయడం కుదరలేదని అరుణ్‌రెడ్డి పేర్కొన్నట్లు మాణెమ్మ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని