logo

లక్షలాది మంది అన్నదాతలకు ఊరట

ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ ప్రారంభిస్తున్న తరుణంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వ్యవసాయదారులకు కేంద్రం ఊరటనిచ్చే కబురు చెప్పింది. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Published : 20 Jun 2024 02:38 IST

న్యూస్‌టుడే, మెదక్‌: ఖరీఫ్‌ వ్యవసాయ సీజన్‌ ప్రారంభిస్తున్న తరుణంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని వ్యవసాయదారులకు కేంద్రం ఊరటనిచ్చే కబురు చెప్పింది. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో లక్షలాది మంది రైతులకు ఉపశమనం లభించనుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు అధికంగా, పెసర, కందులు, మినుము పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. వర్షాకాలంలో పత్తి మాత్రమే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుండగా.. వరి, మొక్కజొన్న పంటలను వానాకాలం, యాసంగి సీజన్లలోనూ సాగు చేస్తుంటారు. వరికి ఎకరాకు సరాసరిన రూ.25వేలు, మొక్కజొన్నకు రూ.10 వేలు, పత్తికి రూ.35వేల వరకు పెట్టుబడి పెడుతుంటారు. చీడపీడలు ఆశించకుండా ప్రకృతి సహకరిస్తే ఎకరాకు 27 నుంచి 30 క్వింటాళ్ల ధాన్యం, 10 నుంచి 18 క్వింటాళ్ల పత్తి, 20 నుంచి 30 క్వింటాళ్ల మొక్కజొన్నలు దిగుబడి వస్తుంది. వరికి క్వింటాకు రూ.117 పెంచగా, పత్తికి రూ.501, మొక్క జొన్నకు రూ.135 పెంచింది. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో రైతులు ప్రభుత్వం పెంచే మద్దతు ధరపై ఆధారపడుతుంటారు. దీనితోనే బహిరంగ విపణిలో పోటీ ఏర్పడి లాభం చేకూరుతుందని రైతులు ఆశిస్తుంటారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని