logo

మార్గదర్శకులు రామోజీరావు

పనే దైవంగా అందనంత ఎత్తుకు ఎదిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రపంచానికే మార్గదర్శకుడిగా నిలిచారని డీజీపీ ఓఎస్డీ మల్లారెడ్డి అన్నారు.

Updated : 26 Jun 2024 05:53 IST

విజేతలతో డీజీపీ ఓఎస్డీ మల్లారెడ్డి తదితరులు 

శివ్వంపేట, న్యూస్‌టుడే: పనే దైవంగా అందనంత ఎత్తుకు ఎదిగిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ప్రపంచానికే మార్గదర్శకుడిగా నిలిచారని డీజీపీ ఓఎస్డీ మల్లారెడ్డి అన్నారు. శివ్వంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కృషి విజ్ఞాన్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌.లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో హెచ్‌ఎం బాలచంద్రం అధ్యక్షతన రామోజీరావు సంస్మరణ సభ మంగళవారం నిర్వహించారు. శ్రద్ధాంజలి ఘటించారు. రామోజీరావు కార్యదక్షతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ‘ఈనాడు’ ఎంతో దోహదం చేస్తుందన్నారు. లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నో సేవలందించారని అన్నారు. వైద్యులు వి.సుబ్రహ్మణ్యం, ఎంఈవో బుచ్చానాయక్, వార్డెన్‌ యాదయ్య, ఉపాధ్యాయులు నర్సింహశర్మ, విజయ, హేమ, చక్రు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని