Published : 27 Nov 2021 01:02 IST
నేటి నుంచే సురానా ఆభరణాల ప్రదర్శన
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల తయారీ, విక్రయ సంస్థ సురానా ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో ఆభరణాల ప్రదర్శన నిర్వహించనున్నారు. డీకే సురానా మెరుగులద్దిన భారతీయ సంప్రదాయ ఆభరణాలతోపాటు కుందన్ మీనా పోల్కీ నగలూ ప్రదర్శించనున్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకూ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు చందనా సురానా తెలిపారు.
Tags :