Published : 27 Nov 2021 01:02 IST
గంజాయి రవాణా చేస్తున్న తల్లీబిడ్డ పట్టివేత
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: గంజాయి రవాణా చేస్తున్న తల్లీ బిడ్డను సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్సై మజీద్ల కథనం ప్రకారం.. పుణెలోని జైజవాన్ నగర్ యర్వడకు చెందిన అంజం నజార్గుల్ పఠాన్(37), ఆమె కుమార్తె సంల్యా నజార్గుల్ పఠాన్(18) ఆర్థిక ఇబ్బందుల కారణంగా గంజాయి రవాణాతో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లి అక్కడి నుంచి 12 కిలోలు కొనుగోలు చేసి పుణెలో విక్రయించేందుకు కోణార్క్ ఎక్స్ప్రెస్లో వెళ్తుండగా గురువారం సికింద్రాబాద్ స్టేషన్ వద్ద జీఆర్పీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయి స్వాధీనం చేసుకొని శుక్రవారం తల్లీబిడ్డను రిమాండుకు తరలించారు.
Tags :