logo
Published : 27 Nov 2021 01:02 IST

వికలాంగుల శాఖను స్వతంత్రంగా కొనసాగించాలి: మంద కృష్ణమాదిగ

కవాడిగూడ, న్యూస్‌టుడే: వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా కొనసాగించాలని మహాజన సోషలిస్ట్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. ఇతర మంత్రిత్వ శాఖలో విలీనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గోరి కడతామని హెచ్చరించారు. శుక్రవారం ధర్నాచౌక్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోరాట దినోత్సవ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛను రూ.6000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం, హక్కులపై డిసెంబరులో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, జనసేన గ్రేటర్‌ అధ్యక్షుడు రాజలింగం, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు గోపాల్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం కాశీం, గ్రేటర్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని