logo
Published : 27/11/2021 01:02 IST

కియా మోటార్స్‌పై తప్పుడు ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కారు తయారీ లోపం వల్లే తనకు రోడ్డు ప్రమాదం జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 బెంచ్‌ మందలించింది. ఫిర్యాదులో పేర్కొన్న దానికి భిన్నంగా సాక్ష్యాలున్నాయంటూ వ్యాఖ్యానించింది. అమీర్‌పేట్‌కు చెందిన నాగరాజు కియా సెల్టోస్‌ హెచ్‌టీఎక్స్‌ ప్లస్‌ కారును 2019 అక్టోబర్‌ 24న కొనుగోలు చేశారు. నవంబర్‌ 3న జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న సమయంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.తాను ఒక్కసారిగా బ్రేక్‌ వేస్తే కారు నియంత్రణ కోల్పోయి 90 డిగ్రీలు తిరిగి పల్టీలు కొట్టిందని ఫిర్యాదులో తెలిపారు. తయారీలో లోపం వల్లే స్టీరింగ్‌, బ్రేకులు పనిచేయక ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యురాలు ఆర్‌.ఎస్‌.రాజేశ్రీతో కూడిన బెంచ్‌ తప్పుడు కేసుగా పరిగణిస్తూ ఫిర్యాదిని మందలించారు. వాహన బీమా క్లెయిమ్‌ కోసం ఫిర్యాదుదారు చేసుకున్న దరఖాస్తు, ఇన్సిడెంట్‌ టెక్నికల్‌ అనాలసిస్‌ రిపోర్టు ఆధారంగా తప్పుడు కేసుగా బెంచ్‌ నిర్ధారించింది. ప్రమాదం 3న జరిగితే నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రిలో ఎలా చేరారంటూ ఫిర్యాదిని ప్రశ్నించారు. తయారీలో లోపం ఉంటే బ్రేకులు పడటానికి ఆస్కారం ఉండదని వ్యాఖ్యానించారు. ఇన్సిడెంట్‌ అనాలసిస్‌ రిపోర్టు తప్పు అని రుజువు చేయడంలో ఫిర్యాది విఫలమయ్యారని పేర్కొంటూ కేసును కొట్టివేశారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని