logo
Published : 27/11/2021 01:02 IST

మూగజీవాలను హింసిస్తున్న బాలుడిపై కేసు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మతిస్థిమితం సరిగా లేని బాలుడు కుక్కపిల్లలను చంపడంతో పాటు పావురాలను విక్రయించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని జువైనల్‌ హోంకు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కేబీఆర్‌ ఉద్యానవనం ప్రధాన ద్వారం నడకదారిలో గేట్‌ నంబరు 2 వద్ద కుక్కపిల్లలకు బంజారాహిల్స్‌లో నివసించే డిజైనర్‌ అండ్లీబ్‌ జైది రోజూ ఆహారాన్ని పెట్టేవారు. ఈ నెల 21న ఆహారం తీసుకొని వెళ్లగా 15 ఏళ్ల బాలుడు మూడు కుక్కపిల్లలను రబ్బరు బెల్టుతో కొట్టి చంపాడు. ఆమె రాకను గమనించిన బాలుడు పారిపోయాడు. వెంటనే ఆమె ఇంటర్‌సెప్టార్‌ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు బాలుడు అక్కడికి రాగా.. అండ్లీబ్‌ గమనించి సమాచారం ఇవ్వగా ఇంటర్‌సెప్టార్‌ పోలీసులు పట్టుకొని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. బాలుడికి మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు చెప్పడంతో వదిలేశారు. అయితే గురువారం సదరు బాలుడు పక్షులను కొట్టడంతో పాటు పావురాలను పట్టుకొని విక్రయించేందుకు ప్రయత్నించడంతో అండ్లీబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాలుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి జువైనల్‌ హోంకు తరలించారు.

అక్రమంగా పక్షుల విక్రయం..

చార్మినార్‌, న్యూస్‌టుడే: పాతబస్తీ జహనుమాకు చెందిన పక్షుల వ్యాపారి మిర్జాఫరీద్‌బేగ్‌(35) వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 పరిధిలోని వచ్చే అరుదైన పక్షులను వేటగాళ్ల నుంచి సేకరించి విక్రయిస్తున్నాడు. సమాచారం మేరకు టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర బృందం అతడి నివాసంపై దాడి చేశారు. మిర్జాఫరీద్‌బేగ్‌ను అరెస్టు చేసి.. పక్షులను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని