logo
Published : 27 Nov 2021 03:17 IST

8 చెరువుల్లో ఆక్సిజన్‌ సున్నా!

పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మనం ఆక్సిజన్‌ లేకుండా ఒక్క క్షణమైనా ఉండగలమా..? ఊహించుకుంటేనే భయమేస్తుంది కదూ..! మనలాగే జలచరాలు కూడా ఉండలేవు. అలాంటిది నగరంలోని ఎనిమిది చెరువుల్లో ఆక్సిజన్‌ శాతం ‘సున్నా’ అని తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక శాతం చెరువులు/కుంటల్లోనూ నిర్దేశిత పరిమితుల కంటే తక్కువగానే ఉన్నట్లు తేల్చారు.

112 చోట్ల నమూనాల సేకరణ

గ్రేటర్‌ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 185 నీటి వనరులున్నాయి. వీటిలో 112 చెరువులు, కుంటల్లో నీటి నమూనాలను సేకరించి సనత్‌నగర్‌లోని ప్రధాన ప్రయోగశాలలో పరీక్షించారు. డీవో, పీహెచ్‌, కండక్టివిటీ, బీవోడీ, టోటల్‌ కోలిఫాం, ఫ్రీ అమ్మోనియా, బొరాన్‌ తదితరాల పరిమాణం ఎంతుందో లెక్క తేల్చారు. మిగిలిన తటాకాలు, కుంటల్లో నీటి నమూనాలను సేకరించేందుకు అవకాశం లేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటరు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ పరిమాణం(డీవో) కనీసం 4 ఎంజీలుండాలి. అంతకంటే తక్కువగా ఉంటే జలచరాలు బతకలేవు. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ) లీటరు నీటిలో 3 ఎంజీల కంటే తక్కువగా ఉండాలి. బాతుల చెరువు, కుమ్మరి కుంట(హయత్‌నగర్‌), ఖైదమ్మ కుంట(హఫీజ్‌పేట్‌), ఈర్ల చెరువు(మదీనాగూడ), సులేమాన్‌ చెరువు(కాటేదాన్‌), ఎర్రకుంట(రాజేంద్రనగర్‌), పల్లె చెరువు(మైలార్‌దేవ్‌పల్లి), భగీరథమ్మ చెరువు(పుప్పాలగూడ)లో ఆక్సిజన్‌ లేదని తేలింది. 30 చెరువుల్లో 1 ఎంజీ కంటే తక్కువగా ఉంది. 49 చెరువుల్లో నిర్దేశిత పరిమితుల(4 ఎంజీలు) కంటే తక్కువగా ఉన్నట్లు తేల్చారు. మిగిలిన 25 చెరువుల్లో 4 ఎంజీల కంటే ఎక్కువగా ఉంది. బీవోడీ విషయానికొస్తే 84 చెరువుల్లో ప్రమాదకరంగా ఉంది. 28 కాసారాల్లో మాత్రమే నిర్దేశిత పరిమితుల(3 ఎంజీలు) కంటే తక్కువగా ఉన్నట్లు పీసీబీ శాస్త్రవేత్తలు తేల్చారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని