logo
Updated : 27 Nov 2021 10:36 IST

TS News: ఒప్పంద ధర్మం.. తలకిందులైన ప్రాణం

శివకుమార్‌గౌడ్‌ పడిపోకుండా పట్టుకున్న లైన్‌మెన్‌ వెంకటయ్య

కందుకూరు, న్యూస్‌టుడే: పొలాల వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మరమ్మతులకు వెళ్లిన ఒప్పంద కార్మికుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ పరిధిలో చోటుచేసుకుంది. లైన్‌మెన్‌ వెంకటయ్య ఇతర సిబ్బందితో కలిసి ముచ్చర్లకు చెందిన ఒప్పంద కార్మికుడు శివకుమార్‌గౌడ్‌(25) జమ్మాల బావి తండా సమీపంలో పొలం వద్దకు వెళ్లారు. అక్కడ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సుమారు 40 నిముషాలపాటు స్తంభంపైనే వేలాడుతూ నరకయాతన అనుభవించాడు. పక్కన ఉన్న వారు స్పందించి కిందకు దించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

తాళ్ల సాయంతో దించేందుకు రైతుల ప్రయత్నం

ప్రమాద క్రమమిది

సాయంత్రం 4.00 గంటలకు: రైతుల పొలాల్లో విద్యుత్తు తీగల మరమ్మతులు చేయడానికి వెంకటయ్య, శివ కుమార్‌గౌడ్‌ కలిసి వెళ్లారు.

4. 05 ముచ్చర్ల సబ్‌స్టేషన్‌ నుంచి రైతుల పొలాలకు ఉన్న ఫీడర్‌ లైన్‌ సరఫరాను ఆఫ్‌ చేయించి 20 నిమిషాల్లో పనులు పూర్తి చేశారు.

4. 35 విద్యుత్తు సరఫరా నిలిపివేసిన జంపర్లను కలిపేందుకు మరో స్తంభం(ప్రమాద ఘటన) వద్దకు వెళ్లారు. వెంకటయ్య ఫోన్లో మాట్లాడుతుండగానే శివ కుమార్‌ గౌడ్‌ వైర్లను కలిపేందుకు స్తంభం పైకి ఎక్కాడు.

4. 36 విద్యుదాఘాతానికి గురికాగా సబ్‌స్టేషన్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది. అతను తీగల్లో చిక్కుకుపోయాడు.

4. 37 వెంకటయ్య సరఫరా ఆన్‌చేయవద్దని సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌కు సూచించారు.

4. 38 స్తంభంపైన్న ఉన్న శివకుమార్‌గౌడ్‌ కిందకు పడి పోకుండా లైన్‌మెన్‌ వెంకటయ్య పట్టుకున్నాడు.

4. 42 రైతులు తాళ్లు తీసుకొచ్చారు.

4. 45 వాటి సహాయంతో బాధితుణ్ని కిందకు దించడంతో ఉపిరి పీల్చుకున్నారు.

4. 55 వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు.

6. 02 నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.


కాలిన గాయాలతో..

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని