logo
Published : 27/11/2021 02:14 IST

రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

కలెక్టర్‌ నుంచి ధ్రువపత్రం అందుకుంటున్న మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు(కుడి నుంచి ఎడమకు) 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస పార్టీ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ తెలిపారు. పోటీలో అభ్యర్థులెవరూ లేకపోవడంతో ఈ ఇద్దరినీ ఏకగ్రీవం చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కోర్టు హాలులో ఇద్దరికీ ఎన్నికల పరిశీలకులు చంపాలాల్‌ సమక్షంలో కలెక్టర్‌ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎన్నికల నోడల్‌ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

కేటీఆర్‌ అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డిలు ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న అనంతరం ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు ఆయనకు, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారిద్దరినీ కేటీఆర్‌ అభినందించారు.

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు తెరాస అభ్యర్థులకు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో జిల్లాలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని