logo
Published : 27/11/2021 02:14 IST

మత్తు ముఠాలతో పరిచయమున్న విదేశీయుడి అరెస్ట్‌


అబ్దుల్లా అహ్మద్‌ అవిస్‌

ఈనాడు, హైదరాబాద్‌: వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న విదేశీయుణ్ని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. సోమాలియాకు చెందిన అబ్దుల్లా అహ్మద్‌ అవిస్‌ అలియాస్‌ జోర్డాన్‌(27) విద్యార్థి వీసాపై భారత్‌కు వచ్చాడు. 2017 జనవరి 1 వరకూ ఉన్న వీసా సమయాన్ని ఫారెనర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) ద్వారా 2020 సెప్టెంబరు 4 వరకూ పొడిగించుకున్నాడు. గడువు ముగిసినా నిబంధనలకు విరుద్ధంగా రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్నాడు. మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలతోనూ అతనికి పరిచయాలున్నట్టు గుర్తించిన పోలీసులు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. నిందితుణ్ని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ కార్యాలయానికి అప్పగించారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని