logo
Updated : 27/11/2021 02:15 IST

రైల్వేస్టేషన్లలో సమస్యలు పరిష్కరిస్తాం


లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో జీఎం గజానన్‌ మాల్య, అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌, శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్‌, లింగంపల్లి స్టేషన్లలో శుక్రవారం జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మల్య సౌర విద్యుత్తు ప్లాంట్లను ప్రారంభించారు. అలాగే, సికింద్రాబాద్‌, బేగంపేట, వికారాబాద్‌, తాండూరు, వాడి సెక్షన్ల మధ్య తనిఖీలు చేపట్టారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు నాగేందర్‌ యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌.ద.మ.రైల్వే జీఎంను లింగంపల్లి స్టేషన్‌లో కలిసి తమ నియోజకవర్గాల పరిధిలో రైల్వే అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. బేగంపేట, వికారాబాద్‌, తాండూరు స్టేషన్లలో ద.మ.రైల్వే పిల్లల ఉద్యానవనాల్ని ఏర్పాటు చేసింది. వీటితోపాటు వికారాబాద్‌లో వ్యాయామశాల ప్రారంభించినట్లు ద.మ.రైల్వే తెలిపింది. లింగంపల్లి రైల్వే స్టేషన్‌ పురోభివృద్ధితోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలుతీసుకుంటానని జీఎం హామీ ఇచ్చారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని