logo
Updated : 28/11/2021 06:10 IST

రక్షణనిస్తూ.. కోలువులిప్పిస్తూ..

నిరుద్యోగులకు వరంగా పోలీసుల ఉద్యోగ మేళాలు

యువతులు.. మహిళలకు ప్రత్యేకం..

నియామక పత్రాన్ని అందజేస్తున్న సీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగర పోలీసులు నిర్వహిస్తున్న జాబ్‌మేళాలు నిరుద్యోగులకు వరంగా మారాయి. యువతకు జాబ్‌మేళాల ద్వారా కొలువులిప్పిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు యువతులు, మహిళలకు ప్రత్యేకంగా మేళాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొద్దిరోజుల క్రితం పాతబస్తీలో నిర్వహించిన ఉద్యోగమేళాకు రెండువేల మంది మహిళలు హాజరయ్యారు. వీరిలో తక్కువ మందికి ఉద్యోగాలిప్పించిన పోలీసు ఉన్నతాధికారులు మిగిలిన వారితోపాటు హైదరాబాద్‌లో ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నవారికి కొలువులిప్పించాలని భావించారు. ఇందుకు ఎక్కడ, ఎలాంటి తరహాలో ఉద్యోగమేళా నిర్వహించాలన్న అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టీఎంఐ సంస్థ సహకారంతో బహుళజాతి సంస్థలు ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొచ్చేలా కార్యచరణ రూపొందించారు.

ప్రజామిత్ర పోలీసింగ్‌లో భాగంగా హైదరాబాద్‌ పోలీసులు ఆరేళ్ల నుంచి జాబ్‌ కనెక్ట్‌, జాబ్‌మేళాల పేరుతో నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు. పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించలేక ఖాళీగా తిరుగుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రాంతాలవారీగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ మేళాలకు హాజరవుతున్న బహుళజాతి కంపెనీలు టెలీకాలర్స్‌, రిసెప్షనిస్ట్స్‌, మానవ వనరుల విభాగం, ఫ్రంట్‌ ఆఫీస్‌ నిర్వహణ వంటి విభాగాల్లో నియమించుకుంటున్నాయి. అర్హులైన వారికి నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల జీతం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మేళాల్లోనే మౌఖిక పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తున్నాయి. ఈనెల 20న చార్మినార్‌ సమీపంలోని మహిళా పోలీస్‌ ఠాణాలో నిర్వహించిన జాబ్‌మేళాలో ప్రైవేటు కంపెనీలు 120 మంది యువతులకు అక్కడిక్కడే నియామకపు పత్రాలు అందజేశాయి. ఒకటి, రెండు నెలల్లో మరో 200 మందికి ఉద్యోగాలిస్తామంటూ తెలిపాయి.

పాతబస్తీ, పశ్చిమ మండలాలకు ప్రాధాన్యం

బహుళజాతి సంస్థలు, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులుగా చేర్పించేందుకు అర్హులైనవారిని గుర్తిస్తున్న పోలీసులు ఎక్కువగా పాతబస్తీ, పశ్చిమ మండలాల్లోని యువతులు, మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారు. వేరే ప్రాంతాల్లో ఉంటున్నవారితో పోలిస్తే... పాతబస్తీ, పశ్చిమ మండలాల్లోని యువతులు బయటకు రావాలంటే అంక్షలుంటున్నాయి. విద్యాధికులైనా సరే.. ఉద్యోగాలకు పంపించేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడకపోవడంతో.. ఆ యువతులు, మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఇంటింటికీ వెళ్లి ఉద్యోగార్థుల జాబితాను సేకరించనున్నారు. ఆ సంఖ్య ఆధారంగా ఎప్పుడు, ఎక్కడ ఉద్యోగ మేళాలు నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. నెలకో జాబ్‌మేళా నిర్వహించడం ద్వారా 300-500 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని భావిస్తున్నారు.

మేళాకు హాజరైన యువతులు

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని