logo
Published : 28/11/2021 03:52 IST

బోధన వినూత్నంగా సాగాలి: డీఈఓ


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జిల్లా విద్యాధికారి రేణుకాదేవి

మర్పల్లి, న్యూస్‌టుడే: ‘సైన్స్‌, గణితం అంశాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వినూత్న పద్ధతిలో బోధించి ఉత్తమ ఫలితాలు సాధించాలని’ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి అన్నారు. శనివారం మండలంలోని కోటమర్పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సర్పంచి విజయ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ‘రామానుజన్‌ అమృత భారత గణిత యాత్ర’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్‌సీటీఎస్‌లో కోటమర్పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్థానం దక్కించుకోవడం అభినందనీయం అన్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల ఉత్సాహం, గ్రామస్థుల సాకారంతో రాష్ట్ర స్థాయిలో ‘కోటమర్పల్లి రేడియో’ గుర్తింపు సాధించిందన్నారు. జాతీయ ఎన్‌సీటీఎస్‌ బృదం సభ్యులు ప్రదేష్‌ దీక్షిత్‌, నేహుల్‌ లక్ష్మీదాస్‌ అర్సోరాలు మాట్లాడుతూ... దేశంలో వినూత్న పద్ధతుల ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్న పాఠశాలను సందర్శించి ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్లో భాగంగా ఈ పాఠశాలకు వచ్చామన్నారు. విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్‌సీటీఎస్‌ స్ట్టేట్‌ డైరెక్టర్‌ ఉమారాణి, అసిస్టెంట్‌ మానిటరింగ్‌ అధికారి రవి, మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం మండలాల ఆదర్శ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరీ శంకర్‌, హరిలాల్‌, లాలయ్య, ఉమారాణి, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్‌ పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని