logo
Updated : 28/11/2021 10:04 IST

Vikarabad: బాల్కనీలో నుంచి పడి చిన్నారి మృతి


వర్ణిక

పరిగి, న్యూస్‌టుడే: ఆటపాటల్లో మునిగిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బాల్కనీలో నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో చోటు చేసుకుంది. ఇదే మండలం రాపోల్‌ గ్రామానికి చెందిన సందీప్‌కుమార్‌, ప్రశాంతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. సందీప్‌కుమార్‌ పరిగిలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులతో కాసేపు సరదాగా ఆటలాడుకున్నారు. అనంతరం తండ్రి బయటకు వెళ్లగా తల్లి ఇంటి పనుల్లో మునిగిపోయింది. పిల్లలిద్దరూ బాల్కనీలో ఆడుకుంటున్న క్రమంలో 18 నెలల వయస్సున్న చిన్నకుమార్తె వర్ణిక రెండంతస్తుల భవనం నుంచి కింద పడింది. తీవ్రంగా గాయపడటంతో నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. నిన్నమొన్నటి వరకు బోసినవ్వులు... ముద్చొచ్చే మాటలతో ఆనందాల్ని పంచిన చిన్నారి మృతితో ఆ ఇంట విషాదం నెలకొంది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని