logo
Updated : 28/11/2021 10:34 IST

Crime News: ఆర్భాటాల కోటకట్టి.. రూ.కోట్లు మూటగట్టి!

కిట్టీ పార్టీలతో ప్రముఖులకు కిలాడీ దంపతుల టోకరా

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, నార్సింగి: విలాసవంతమైన జీవితం. నిత్యం పహారాకాసే బౌన్సర్లు. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు ప్రముఖులను బుట్టలో వేసుకొని రూ.కోట్లలో బురిడీ కొట్టించారా కిలాడీ దంపతులు. స్థిరాస్తి వ్యాపారంలో లాభాలిస్తామంటూ ప్రముఖుల నుంచి భారీగా వసూలు చేశారు. అడిగేందుకు వెళితే బెదిరింపులకు దిగారు. ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరి మాయనాటకం వెలుగుచూసింది. ఆ వివరాలను శనివారం మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వివరించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో జెల్లా శిల్ప అలియాస్‌ శిల్పాచౌదరి, కృష్ణశ్రీనివాసప్రసాద్‌ దంపతులు నివసిస్తున్నారు. సినిమా నిర్మాణం, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామంటూ ఆమె ప్రచారం చేసుకునేది. దంపతులిద్దరూ కలిసి తాజాగా సహేరి సినిమా తీశారు. వివాదాల్లో ఉండటంతో విడుదల కాలేదు. తమ హంగూ ఆర్భాటాలతో నగరంలో వ్యాపారవర్గాలకు చెందిన సుమారు 20 మంది మహిళలతో శిల్పాచౌదరి తరచూ కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసేది. ఆమె ఉచ్చులో చిక్కిన మహిళలకు లాభాల ఆశచూపి భారీగా డబ్బు వసూలు చేసింది. లాభాలు వస్తే వాటాలు ఇస్తామని, నష్టాలు వస్తే తీసుకున్న డబ్బుకు వడ్డీ కలిపి ఇస్తానంటూ నమ్మకం కలిగించింది. నిజమని భావించి పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి రూ.1.05 కోట్లు, మంచిరేవులకు చెందిన రోహిణి రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చారు. నెలల గడుస్తున్నా అసలు, వడ్డీ చేతికి రాకపోవటం, ఫోన్లకు స్పందించకపోవడంతో దివ్యారెడ్డి ఈనెల 8న శిల్పాచౌదరి ఇంటికి వెళ్లారు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. శిల్ప తన వద్దనున్న బౌన్సర్లతో ఆమెను బెదిరించింది. ఈమేరకు బాధితురాలు నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం శిల్ప దంపతులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున న్యాయస్థానం దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.


Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని