logo
Published : 28/11/2021 04:15 IST

నేడు ట్యాంక్‌బండ్‌పై స్వచ్ఛతా సంబరం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నగరవాసుల వారాంతపు విహారానికి చిరునామాగా మారిన సాగర తీరంలో ఈ ఆదివారం స్వచ్ఛతా సంబరాలు జరగనున్నాయి. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం అందించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 పురస్కారాలు దక్కగా.. జాతీయ స్థాయిలో చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌కు త్రీస్టార్‌ రేటింగ్‌ లభించింది. దీన్ని పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌ రోడ్డు పొడవునా వ్యర్థాల నిర్వహణలో సాధించిన ఘనతలు, చేపడుతున్న చర్యలకు సంబంధించిన దృశ్యాలను జీహెచ్‌ఎంసీ బృందాలు ప్రదర్శించనున్నాయి. ఇంటి నుంచి వ్యర్థాల సేకరణలో పౌరుల భాగస్వామ్యం, త్రీస్టార్‌ నుంచి ఫైవ్‌స్టార్‌ సాధించుకునేందుకు కావాల్సిన సహకారంపై అవగాహన కార్యక్రమాలూ చేపట్టనున్నాయి. ఇక్కడ ప్రతివారం ఏర్పాటు చేస్తున్న ఆహారం, హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శనలు యథావిధిగా కొనసాగనుండగా.. ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ రహిత స్టాళ్లనూ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. అర్బన్‌ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 30 రకాల మొక్కలనూ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని