logo
Published : 29/11/2021 00:35 IST

హామీ నెరవేరదేమి?

న్యూస్‌టుడే, తాండూరు

పాతకుంట దుస్థితి

మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి భూగర్భడ్రైనేజి ఏర్పాటుతో పాటు శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని నేతలు హామీలు ఇస్తున్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడగానే ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. దీంతో దశాబ్దాల ప్రజల కల నెరవేరడంలేదు. జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా పేరున్న తాండూరులో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు అత్యవసరం. 13,000 గృహాల్లో అధికారికంగా 71,000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. అనధికారికంగా లక్షమంది ఉంటున్నారని అంచనా. వీరంతా గృహాల్లో వివిధ అవసరాలకు వినియోగిస్తున్న నీరు 5లక్షల లీటర్లకు పైగానే ఉంది. ఇదంతా వృథాగా మారి కాలువల ద్వారా పట్టణంలోని గొల్లచెరువు, కాగ్నానది, చిలుకవాగు, పాతకుంట, మల్‌రెడ్డి పల్లి చెరువులోకి వెళుతోంది. ఫలితంగా తాగు, సాగు నీటి అవసరాలకు సంబంధించిన వనరులు పూర్తిగా కాలుష్య కారకంగా మారిపోయాయి. పట్టణంలోని మురుగంతా ఒకే చోటకు చేర్చి శుద్ధి చేస్తే మున్సిపాలిటీకీ ఆర్థిక ప్రయోజనం ఒనగూరడంతో పాటు పట్టణం పరిశుభ్రంగా మారనుంది.

భూగర్భడ్రైనేజీ అవసరం: పట్టణంలో వివిధ అవసరాలకు వినియోగిస్తున్న నీరు వృథాగా మారాక భూమిపై నిర్మించిన కాలువల ద్వారా ప్రవహించే విధంగా కాకుండా భూ గర్భం నుంచి ప్రవహించేలా కాలువల నిర్మాణం జరగాలి. ఇవే కాలువల్లోనుంచి ఇళ్ల నుంచి వెళ్లే నీరు నీటి శుద్ధి ప్లాంట్‌ వరకు వెళ్లే ఏర్పాట్లు జరగాలి. అక్కడ నీరు శుద్ధి చేశాక, అవకాశాన్ని బట్టి విక్రయించుకోవచ్చు. ప్లాంట్‌ వద్ద వేరయిన చెత్తతో ఉత్పత్తి చేసే ఎరువును రైతులకు ఇతర ఔత్సాహికులకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. వికారాబాద్‌ మున్సిపాలిటీలో రూ.13 కోట్లతో నిర్మించిన ప్లాంట్‌లో శుద్ధి చేసిన నీటిని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్ప్‌ కోర్స్‌కు విక్రయించి ఏడాదికి రూ.5లక్షల చొప్పున రెండేళ్ల నుంచి ఆదాయం పొందుతున్నారు. తాండూరులోనూ ఏర్పాటు చేస్తే ప్రయోజనం పొందవచ్చు. తాండూరు మండలంలోని సీసీఐ, పెన్నా. ఇండియా సిమెంట్స్‌ ఉత్పత్తుల వినియోగంలో కాగ్నా నీటిని ప్రత్యేక గొట్టాల ద్వారా వినియోగిస్తున్నాయి. ఇవే గొట్టాలకు మున్సిపాలిటీలో శుద్ధిచేసిన నీటిని సరఫరా చేసే గొట్టాలను అనుసంధానిస్తే సరిపోతుంది. ఇందుకు అవసరమైన ప్లాంట్‌, గొట్టాల ఏర్పాటుతో పాటు నీటి వినియోగానికి సిమెంటు కంపెనీలు ముందు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.


గొల్లచెరువులోకి పారుతున్న మురుగు

రూ.130 కోట్లు కావాలని ప్రతిపాదన పంపించాం
- ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, తాండూరు

పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.130 కోట్లు కావాలని కోరుతూ ఏడాది కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అలాగే  చిలుక వాగు, గొల్లచెరువు సమీపాల్లో ఒక్కో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరాం. ఇదే విషయమై మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీని కలిసి వివరించాం.

మంత్రి కేటీఆర్‌కు విన్నవిస్తా
- స్వప్న, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, తాండూరు

ఈ రెండు పట్టణానికి ప్రధానం అంశాలు. వీటి గురించి మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవిస్తా. పట్టణంలో మురుగు శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఉంది. గతంలో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల గురించి మంత్రికి వివరిస్తా.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని