logo
Published : 29/11/2021 00:35 IST

బాధ్యతగా సాగితే.. బడులు బలోపేతం

విద్యాకమిటీల గడువు పెంపు

న్యూస్‌టుడే, కొడంగల్‌ గ్రామీణం: సర్కారు బడుల బలోపేతానికి విద్యాశాఖ అధికారులు కొత్త పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులను భాగస్వాములుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి ఏడాది ‘యాజమాన్య కమిటీ’లను ఎన్నుకుంటూ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటుగా సభ్యులకు పాఠశాల నిర్వహణ, అభివృద్ధి విషయంలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ నెలాఖరుకు వీటి పదవీకాలం ముగియనుండటంతో, ఆరు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లాలో విద్యాకమిటీలకు 2019 నవంబరు 30న ఎన్నికలు నిర్వహించారు. కొత్త కమిటీలు ఏర్పాటైన మూడున్నర నెలలకే కరోనా ప్రభావంతో ఏడాదిన్నర పాఠశాలలు కొనసాగలేదు. ప్రస్తుతం నవంబరు 30తో రెండేళ్ల పదవీకాలం ముగియటంతో ఈ ఏడాది డిసెంబరు ఒకటి నుంచి 31 మే 2022 వరకు ఆరు నెలలు పదవీకాలాన్ని పొడిగించారు. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు ఇప్పుడి…ప్పుడే గాడిన పడుతుండగా కొత్త కమిటీలతో కాకుండా ఉన్నవాటిని కొనసాగించేందుకు విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.  

లక్ష్యం ఇలా....: విద్యాకమిటీల లక్ష్యం నెరవేరాలంటే బాధ్యత తెలియాలి. అధికారులు తలపెట్టే ప్రతి కార్యక్రమం పాఠశాల స్థాయిలో విజయవంతంగా కొనసాగాలంటే వీరే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. కొవిడ్‌ ప్రభావంతో వీటి పాత్ర నామమాత్రంగానే మారింది. పాఠశాల సముదాయ స్థాయిలో మరో సారి వీరికి అవగాహన కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
విధులు
* ఊరిలోని బడి ఈడు పిల్లలను విధిగా పాఠశాలలో చేర్పించాలి. విద్యార్థుల్లో సామర్థ్యాల.పెంపునకు కృషి.
* గ్రామాల్లోని దాతలు, ప్రజాప్రతినిధుల నుంచి నిధులు సేకరించి విద్యార్థులకు సౌకర్యాల కల్పన
* ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేస్తూ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించడం.
* విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు విధానాన్ని పరిశీలించాలి. నిధులు సక్రమంగా ఖర్చుపెట్టే విధంగా పర్యవేక్షణ.
* రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ప్రతి కార్యక్రమం అమలు చేయించాల్సిన బాధ్యత.

భాగస్వామ్యం పెంచేందుకే..

- రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌

విద్యాకమిటీల గడువు ముగియనుండగా డిసెంబరు నుంచి ఆరు నెలలు పొడగిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేందుకు వీటిని ఏర్పాటు చేశారు. పాఠశాల బాగోగులు చూసుకుంటూ, సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని