logo
Published : 29/11/2021 00:35 IST

రెచ్చిపోయిన దొంగలు

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఓ ఇంట్లో ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రామునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉంటున్న అరుణ్‌ప్రసాద్‌రెడ్డి మియాపూర్‌లో బంధువుల  ఇంట్లో వేడుకకు ఉదయం వెళ్లారు. దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాల లోపల ఉన్న బంగారం దొంగిలించారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న 13 తులాల బంగారం, రూ.10 వేల నగదు కన్పించలేదు.

బ్యాటరీల దుకాణంలోనూ..

ముత్తంగి జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఎంకేఎం పవర్‌ బ్యాటరీల దుకాణంలో ఓ వ్యక్తి రూ.2 లక్షలు దొంగిలించాడని దుకాణ నిర్వాహకుడు మొయినుద్దీన్‌ తెలిపాడు. భోజనానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి వచ్చి నగదు తీసుకుంటున్న దృశ్యాలు దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదు అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని