logo
Published : 29/11/2021 00:35 IST

సగం సగం వెలుగులు!

స్కాడా పరిధిలోకి రాని 248 విద్యుత్తు ఉపకేంద్రాలు

ఆదిత్య పథకంలో నిధులు వస్తేనే ముందడుగు

ఈనాడు, హైదరాబాద్‌: కరెంట్‌ పోతే వినియోగదారుడు ఫిర్యాదు చేసే వరకు ఏఈకి తెలిసేది కాదు.. నాలుగైదు గంటల పాటు సరఫరా నిలిచిపోయినా ఎస్‌ఈ దృష్టికి వెళ్లేది కాదు.. లో, హైవోల్టేజీ సమస్యలు సీజీఎం స్థాయి అధికారికి తెలియాలంటే రెండు, మూడునెలలు పట్టేది. ఇందుకు భిన్నంగా సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా అక్వైజేషన్‌ (స్కాడా) పరిధిలోకి తీసుకొచ్చిన విద్యుత్తు ఉప కేంద్రాల్లో సమస్య వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వెళ్తోంది. కార్యాలయం నుంచే క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు. అయితే ఈ వ్యవస్థ నేటికీ నగరంలోని సగం విద్యుత్తు ఉప కేంద్రాలకే పరిమితమైంది.
ః నగరం వేగంగా విస్తరిస్తుండటంతో విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయి. గృహ నిర్మాణం, కార్యాలయాలు, పరిశ్రమల రాకతో శివార్లలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2014కి ముందు 333 విద్యుత్తు ఉపకేంద్రాలు ఉంటే ప్రస్తుతం వీటి సంఖ్య 476కి చేరింది. వీటిలో ప్రస్తుతం 228 విద్యుత్తు ఉప కేంద్రాలకు మాత్రమే స్కాడాతో అనుసంధానం చేశారు. 2007లో ఆర్‌-ఏపీడీఆర్‌పీ పథకం కింద వీటిని చేపట్టారు. ఆ తర్వాత ఏటా కొత్తగా 15 నుంచి 20 విద్యుత్తు ఉప కేంద్రాలను ఛార్జ్‌ చేశారు. వీటన్నింటిని కలుపుకుంటే మరో 248 విద్యుత్తు ఉపకేంద్రాలను స్కాడా పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు కావాలి. కేంద్రం ప్రకటించిన ఆదిత్య పథకంలో మిగిలిన ఉపకేంద్రాలను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చే ప్రణాళికలను డిస్కం రూపొందించింది. తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలో మిగిలిన 122 విద్యుత్తు ఉపకేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఫీడర్ల వరకు... జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,062 వరకు 11 కేవీ ఫీడర్లు ఉన్నాయి. 2,000 గృహ ఫీడర్లు కాగా, 318 పరిశ్రమలవి.. మిగతావి మిక్స్‌డ్‌గా ఉన్నాయి. వీటిలో 158 ఫీడర్లను మాత్రమే ఆటోమేషన్‌ చేశారు. వీటి పరిధిలో ఎక్కడైనా లైన్‌ ట్రిప్‌ అయితే సమస్య ఉన్న లైన్‌ మినహా మిగతా లైన్లు సెకన్ల వ్యవధిలోనే తిరిగి ఆన్‌ అవుతాయి. ఒకప్పుడు సగటు అంతరాయాల సమయం 10 నిమిషాలు ఉంటే.. ప్రస్తుతం సెకన్లకు వచ్చిందని అధికారులు తెలిపారు. మిగతా ఫీడర్ల ఆటోమేషన్‌ కోసం భారీగా నిధులు కావాల్సి ఉంది. ఒక్కో ఫీడర్‌కు రూ.5 లక్షల వరకు అవుతుందని అంచనా. ఆదిత్య పథకంలోనే వీటికి సైతం ప్రతిపాదనలు పెట్టారు.

ఇవి ప్రయోజనాలు
* విద్యుత్తు ఉప కేంద్రాలు, ఫీడర్లు ఆటోమేషన్‌తో అంతరాయాలు గణనీయంగా తగ్గనున్నాయి. 

* లైన్లు, ఫీడర్లు ట్రిప్‌ అయితే వెంటనే ఉపకేంద్రంలో అలారం మోగుతుంది. స్కాడాలోనూ తెలుస్తుంది.

* అంతరాయాలకు సంబంధించి రోజూ స్కాడా నుంచి ఉదయంపూట ఆయా సర్కిళ్ల ఎస్‌ఈలకు సమాచారం వెళుతుంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.

* వినియోగదారులకు అంతరాయాల సమాచారం కచ్చితత్వంతో తెలియజేయవచ్చు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని