logo
Published : 29/11/2021 00:35 IST

ధర్మ పరిరక్షకులుగా చిన్నారుల్ని తీర్చిదిద్దాలి

మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి, చిత్రంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, వెల్లాల రాంమోహన్‌ తదితరులు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: సనాతన వైదిక ధర్మాన్ని పరిరక్షించేవారిగా చిన్నారులను తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు వెల్లాల రాంమోహన్‌ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవస్థానం ప్రాంగణంలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం కార్తిక వన సమారాధన, బ్రాహ్మణ సమ్మేళనాన్ని నిర్వహించారు. అంతకుముందు త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి భక్తులనుద్దేశించి ప్రసంగించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ ఎం.రాంచందర్‌రావు, దేవాదాయశాఖ అర్చక, ఉద్యోగ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ పరాశరం రవీంద్రాచార్యులు, కార్పొరేటర్లు కేతినేని సరళ, శ్రవణ్‌, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు జి.విజయలక్ష్మి, పంచగంగేశ్వర్‌, ఎం.వి.శాస్త్రీ, చకిలం సుధాకర్‌, ఓటేటి ఫణీంద్రలు పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని