logo
Published : 29/11/2021 07:32 IST

OU: ఓయూలో సమాధి కలకలం

చెట్ల మధ్య సమాధి

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం నడకకు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. వారు తిరిగి వసతి గృహాలకు పరుగెత్తారు. ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఈసీహెచ్‌-1 వసతిగృహానికి దగ్గరగా చెట్ల మధ్య ఇది ఉంది. దానిపై తాజాగా చల్లిన పూలు ఉన్నాయి. అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉంటారని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఓయూలో బయటి వ్యక్తులు రాకుండా కొత్త కాపలాదారులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఓవైపు అధికారులు చెబుతున్నారు. తాజా ఘటనతో భద్రతపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఓయూ భద్రత అధికారిని వివరణ అడగ్గా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. పోలీసులు కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని