logo
Published : 29/11/2021 01:43 IST

ఏడు పదుల వయసులో కరాటే ప్రదర్శన

ఛాతిపై రాళ్లు పగులగొట్టించుకుంటున్న డా.ఎద్దుల కృష్ణ

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: అతని వయసు 70 ఏళ్లు. అనేక సంవత్సరాలుగా నాడి పట్టి సేవలందిస్తున్న వైద్యుడు. సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.  సైదాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహించే డాక్టర్‌ ఎద్దుల కృష్ణ కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించారు. స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకుని జీవీఆర్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నారాయణగూడలోని మాడపాటి బాలికోన్నత పాఠశాలలో ఆదివారం మేకులపై పడుకుని 7 నిమిషాల్లో 159 షాబాద్‌ బండలను ఛాతీపై పగులగొట్టించుకున్నారు. దీనిని రికార్డుగా వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, జై ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, విశ్వం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, డైమండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లలో నమోదు చేసినట్లు ఆయా సంస్థల నిర్వాహకులు  తెలిపారు. విశ్రాంత జడ్జి డాక్టర్‌ బూర్గుల మధుసూదన్‌.. డాక్టర్‌ ఎద్దుల కృష్ణను సత్కరించి రికార్డులను అందజేశారు.  జీవీఆర్‌ కరాటే అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ గోపాల్‌రెడ్డి, హిమాయత్‌నగర్‌ కార్పొరేటర్‌ మహాలక్ష్మి, భాజపా నేత జి.రామన్‌గౌడ్‌, ప్రొఫెసర్‌ వసుంధరారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఐకాస ఛైర్మన్‌ కోట్ల నిరంజన్‌రెడ్డి, న్యాయవాది మాణిక్‌ప్రభు, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వివేక్‌ వినాయక్‌, సీనియర్‌ పాత్రికేయుడు ఈశ్వర్‌రెడ్డి, తెరాస నేత దేవిరెడ్డి విజితారెడ్డి ఆయన్ను అభినందించారు.

రికార్డులు అందజేస్తున్న విశ్రాంత జడ్జి మధుసూదన్‌

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని