logo
Published : 29/11/2021 07:19 IST

అభూత కల్పనలు... అబద్ధపు హామీలు

 సభ్యత్వం పేరుతో మోసపూరిత ప్రకటనలు
రూ.50 వేలు చెల్లించాలని కంట్రీ వెకేషన్స్‌కు ఆదేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కంట్రీ వెకేషన్స్‌ మాయలో పడి మోసపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నెరవేర్చని హామీలతో, అభూత కల్పనలతో సభ్యత్వ రుసుము వసూలు చేసి ఇబ్బంది పెట్టిన సంస్థ నుంచి పరిహారం ఇప్పించాలంటూ పలువురు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కె.బి.శ్రీధర్‌ వారిలో ఒకరు. ఆయనకు రూ.50 వేల పరిహారం చెల్లించడంతో పాటు సభ్యత్వ రుసుము కింద వసూలు చేసిన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ ఆ సంస్థను బెంచ్‌ ఆదేశించింది. ఫిర్యాదీ తెలిపిన వివరాల ప్రకారం.. కంట్రీ వెకేషన్స్‌ సంస్థ ప్రతినిధి తన వద్దకు వచ్చి నల్గొండలోని చింతపల్లి గ్రామంలో ఉన్న సాగర్‌ పుష్పవన్‌ వెంచర్‌లో 150 చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేయాలని కోరారు. రూ.1,40,000 కడితే థమ్స్‌ అప్‌ సభ్యత్వం కలిసొస్తుందని తెలిపారు. ఫిట్‌నెస్‌ సెంటర్‌, విహార యాత్ర, బ్లూ స్టూడియో వినియోగం తదితరాలన్నీ అందులో ఉంటాయని వివరించడంతో శ్రీధర్‌ ఆ మొత్తాన్ని చెల్లించారు. ప్రతినిధి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్లాట్‌నూ చూపించలేదు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేకపోగా.. ఇందుకోసం సెలవులు ఎక్కువగా తీసుకోవడంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం ఇప్పించాలని విన్నవించారు. దీనిపై కంట్రీ వెకేషన్స్‌ రాతపూర్వక వివరణ ఇచ్చింది. అన్నింటినీ విచారించిన హైదరాబాద్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌-3 బెంచ్‌ ఫిర్యాదీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని