logo
Published : 29/11/2021 02:56 IST

మెట్రోకి 4 ఏళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: మూడు మార్గాల్లో నడుస్తున్న హైదరాబాద్‌ మెట్రో ఆదివారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబరు 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా తొలిదశ మెట్రో ప్రారంభం అయ్యింది. 69.2 కి.మీ. మార్గం మొత్తం 4 దశల్లో అందుబాటులోకి వచ్చింది. సగటున ప్రతిరోజూ 4 లక్షల ప్రయాణికుల మైలురాయిని చేరుకున్న దశలో కొవిడ్‌ రూపంలో పెద్ద దెబ్బ పడింది. కరోనా సమయంలో 169 రోజులు మెట్రోరైళ్లు డిపోలకే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనా ప్రయాణికుల సంఖ్య ఇంకా పూర్వస్థాయికి చేరుకోలేదు. ప్రస్తుతం సగటున ప్రతిరోజూ 2.30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పనిరోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు 3 లక్షల వరకు రాకపోకలు సాగిస్తుంటే వారాంతాల్లో 2 లక్షలలోపు ఉంటున్నారు.

ఐటీ కార్యాలయాలు మొదలైతే..

కొవిడ్‌కు ముందు ఐటీ కారిడార్‌కు వెళ్లే నాగోల్‌-రాయదుర్గం మార్గం ఉదయం, సాయంత్రం వేళ అత్యంత రద్దీగా ఉండేది. రద్దీని తట్టుకునేందుకు అమీర్‌పేట నుంచి లూప్‌ ట్రైన్లు నడిపేవారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో వీరంతా మెట్రోకి దూరమయ్యారు. మెట్రో ప్రయాణికుల్లో వీరే లక్షన్నర వరకు ఉంటారని అంచనా. వీరిపైనే మెట్రో వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

సరిదిద్దాల్సినవి...

* మహిళలకు కేటాయించిన కోచ్‌లలో పురుషులు ప్రవేశిస్తున్నారు. మహిళలు వచ్చినా అక్కడి నుంచి కదలడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. 

* పలు చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు మొరాయిస్తున్నాయి.

* స్టేషన్లలో మరుగుదొడ్ల పరిశ్రుభతపైనా ఫిర్యాదులున్నాయి.

* స్టేషన్ల నుంచిగమ్యస్థానం చేరేందుకు లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీని పెంచాల్సి ఉంది.

మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు అత్యంత ప్రతిష్ఠాత్మక కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఇండియా అవార్డులు-2021లో ‘మెట్రో రైలు ప్రాజెక్ట్‌ - లైఫ్‌ సైకిల్‌ ఎకనమిక్స్‌ బెనిఫిట్స్‌’ విభాగంలో అవార్డు అందుకుంది. ఇటీవల ముంబయిలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఎల్‌ అండ్‌ టీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుధీర్‌ చిప్లుంకర్‌ అందుకున్నారు. మెట్రో నిరంతరం అందుబాటులో ఉంటూ సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్తు వినియోగం, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం వరకు.. మెట్రోతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో సీఈవో కేవీబీరెడ్డి తెలిపారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని