logo
Published : 29/11/2021 15:40 IST

సకాలంలో వైద్యం అందక వ్యక్తి మృతి

పరిగి: సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పరిగిలో సోమవారం చోటు చేసుకుంది. పరిగికి చెందిన ఉప్పరి నారాయణ (70) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తీసుకెళ్లిన అరగంట వరకు కూడా వైద్యులెవరూ అందుబాటులో లేరు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ విధులకు గైర్హాహరు కావడంతో సకాలంలో వైద్యం అందక నారాయణ కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడంటూ కుమార్తెలు ఆరోపించారు.  ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. తాను డెంటల్‌ డాక్టర్‌నని గుండె సంబంధిత వ్యాధులను నిర్ధరించలేనని స్పష్టం చేశారు. 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని