Ts News: ఆ 6 జిల్లాలపై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టాలి.. కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. ప్రజారోగ్యం

Updated : 29 Nov 2021 17:01 IST

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. ప్రజారోగ్యం, వైద్యారోగ్య శాఖ సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్‌ పడకల సామర్థ్యం, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వార్తల నేపథ్యంలో కార్యాచరణ, సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఒమిక్రాన్‌ గురించి, వివిధ దేశాల్లో ఒమిక్రాన్‌ పరిస్థితిపై వైద్య అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని తెలిపారు. అన్ని మందులు, పరికరాలు, మానవ వనరులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు.

‘‘రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలి. మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. మంత్రులంతా జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్షించాలి. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలి. ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆదిలాబాద్‌, కుమరం భీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొవిడ్‌ పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి’’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు, మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే చర్యలపై ఉపసంఘం ఏర్పాటు..

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పరిశీలన, కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కేబినెట్‌ ఏర్పాటు చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌, సబితా ఇంద్రారెడ్డి సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు సబ్‌ కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని