Ts News: గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలి: సబితా ఇంద్రారెడ్డి

కొన్ని విద్యా సంస్థల్లో కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని.. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు

Updated : 29 Nov 2021 17:29 IST

హైదరాబాద్‌: కొన్ని విద్యా సంస్థల్లో కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయని.. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో కొవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి ఆదేశించారు. గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలల సిబ్బంది తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని చోట్ల పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. సానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను పాఠశాలల్లో తప్పనిసరిగా వాడాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని