logo
Published : 30/11/2021 00:49 IST

చికిత్స అందక వృద్ధుడి మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆందోళన

ఆసుపత్రిలో మృతి చెందిన నారాయణ

పరిగి, పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: సకాలంలో వైద్యం అందకపోవడంతో ఓ వృద్ధులు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన  పరిగిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పరిగికి చెందిన ఉప్పరి నారాయణ (70) ఆదివారం రాత్రి అనారోగ్యానికి గురికావడంతో సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ లేరు. కేవలం నర్సు ఒక్కరే  విధులు నిర్వహిస్తున్నారు.  అరగంట దాటినా ఎవరూ రోగిని చూసేందుకు ముందుకు రాలేదు. చాలా సేపటికి నర్సు ఇతరుల సాయంతో ఈసీజీ యంత్రంతో గుండె పనితీరును పరిశీలించేందుకు యత్నించారు. యంత్రం కూడా మొరాయించింది. బాధితుల ఆందోళనతో ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ సత్యనారాయణను కుటుంబీకులు నిలదీశారు. డ్యూటీ డాక్టర్‌ రాలేదని మిగతా ఇద్దరు నర్సులు ఇతర విధుల్లో ఉన్నందువల్లే ఒక్క నర్సు మాత్రమే పనిచేస్తున్నట్లు బదులిచ్చారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కనీసం ఇతర ఆసుపత్రికైనా పంపాలని చెప్పినా లాభం లేకుండా పోయింది. తాను డెంటల్‌ డాక్టర్‌ను అని గుండెకు సంబంధించి తమకు అంతగా తెలియని సమాధానం ఇచ్చాడు. ఈలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వెద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట డిమాండ్‌ చేశారు.

ఎలాంటి సమాచారం లేదు
- డాక్టర్‌ సత్యనారాయణ, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌
డ్యూటీ డాక్టర్‌ స్వర్ణలత ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజయ్యారు. బొంరాస్‌పేటలో డీపీఎల్‌ క్యాంపు ఉండటంతో ఇద్దరు నర్సులు అక్కడికి వెళ్లారు. ఆసుపత్రిలో ఒక్కరే నర్సు పనిచేస్తున్నారు. ఈసీజీ యంత్రం పనిచేస్తున్నా.. ప్రింటు రావడం లేదు. నర్సుకు అవగాహన కూడా లేకపోవడంతో ఇబ్బంది కలిగింది. రెండు నెలల క్రితమే యంత్రాన్ని సర్వీసింగ్‌ కూడా చేయించాం. విధులకు రాని వైద్యురాలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని