logo
Published : 30/11/2021 03:34 IST

గురుకుల పీఈటీ పోస్టులనియామకాలు చేపట్టండి


మంత్రి సబితారెడ్డి కార్యాలయం వద్ద భైఠాయించిన అభ్యర్థులు

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ నియామకాల ప్రక్రియ పూర్తిచేయక నాలుగున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని గురుకుల పీఈటీలుగా ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 2017లో వెలువడిన నోటిఫికేషన్‌ ప్రకారం 616 గురుకుల పీఈటీ పోస్టుల నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ నిరుద్యోగ ప్రైవేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. పలువురు తల్లులు చంటి పిల్లలతో వచ్చి మంత్రి కార్యాలయం ముందు భైఠాయించారు. తల్లిదండ్రులకు ఉద్యోగాలివ్వాలని చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సైదులుగౌడ్‌ మాట్లాడుతూ నోటిఫికేషన్‌ సరిగా ఇవ్వని కారణంగా నాలుగున్నరేళ్ల కాలాన్ని కోల్పోయామన్నారు. పలుమార్లు ప్రగతిభవన్‌, టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడించినా ఫలితం లేదని.. ఈసారి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని