logo
Published : 01/12/2021 02:12 IST

గగనాలు దాటి దివికేగిపోగా..

భాగ్య నగరంతో సిరివెన్నెలకు విడదీయరాని అనుబంధం

ఈనాడు, హైదరాబాద్‌: ఆయన పాట సామాజిక సందేశం.. మాట జీవితానికి దిశానిర్దేశం. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన పాటలు.. కవితలు.. పదాలు ఏవైనా మేల్కొలుపు పాఠాలే. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సామాన్యుల నుంచి సాహితీవేత్తల వరకూ భావోద్వేగానికి గురిచేసింది. ఆయన పాటలను గుర్తుచేసుకునేలా చేసింది. నగరంతో ఆయనది దశాబ్దాల అనుబంధం. శ్రీనగర్‌ కాలనీలో 16 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. బయటకు వచ్చినపుడు ఎదురయ్యే ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలుకరించేవారంటారు స్థానికులు. వెండితెరపై పాటల రచయితలుగా వెలగాలనుకునే ఎందరో ఆయన వద్దకెళ్లి సలహాలు కోరేవారట. సాహిత్యంపై మక్కువ ఉన్న వారు సందేహాలను నివృత్తి చేసుకునే వారని కూడా అంటారు. సీతారామశాస్త్రికి హైదరాబాద్‌ మహానగరం చాలా ఇష్టం.. అందులోనూ అప్పట్లో చెరువుల వద్ద సేదతీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ పదాలు రాసేవారంటారు ఆయన శిష్యులు. ప్రకృతి చెంత ఇష్టపడి తీయించుకున్న ఫొటోను ట్విట్టర్‌ వాల్‌పై జ్ఞాపకంగా ఉంచుకున్నారు. 2017లో హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని తెలుగు భాషకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. వివిధ సాహితీ వేదికల్లో పాల్గొంటూ యువ కవులను ప్రోత్సహించేవారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ప్రకృతిపై మమకారం చాటుకోవటం.. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చేయాలనే అంశాలను వీడియోల ద్వారా దగ్గర చేసే ప్రయత్నంచేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చిన నివాళులు అర్పించారు.

ఆసుపత్రి వద్ద విషణ్న వదనంతో చిరంజీవి


ప్రకృతి చెంత.. పాటల సేద్యం: దుర్గం చెరువు సమీపంలో..

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని