logo
Published : 01/12/2021 02:21 IST

కావాలి నిధులు.. కొనాలి బస్సులు

ఛార్జీలు పెంచాలని ముఖ్యమంత్రికి ఆర్టీసీ నివేదన

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని నగరంలో ఆరేడేళ్ల కిందట తిరిగే సిటీ బస్సుల సంఖ్య 5500పై మాటే. ఇప్పుడు అది 2700కు తగ్గిపోయింది. దీంతో నిత్యం ప్రయాణించే 30 లక్షల మంది అవసరాలకు తగ్గట్లు బస్సులు నడపలేని పరిస్థితి. అందుకే ప్రభుత్వం ఆర్థికంగా ఇచ్చే అండతోపాటు టిక్కెట్‌ ఛార్జీల పెంపుతో వచ్చే ఆదాయంలో కొంత నిధులతో కనీసం రెండువేల కొత్త బస్సులను కొనాలని ఆర్టీసీ చూస్తోంది. రేట్ల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. ఎప్పుడు అనుమతి ఇస్తారో అని ఆర్టీసీ అధికారులు ఎదురు చూస్తున్నారు.

అక్కడ భళా
మెట్రో రైళ్లు అధికంగా తిరుగుతున్నా కూడా పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, చెన్నైలో పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అక్కడి సిటీ సర్వీసులకు పెద్దఎత్తున ప్రయాణికుల నుంచి ఆదరణ దక్కుతోంది. బెంగళూరు ఆర్టీసీ అంతో ఇంతో లాభాలను ఆర్జిస్తోంది. రానున్న నాలుగేళ్లలో ఇప్పుడున్న బస్సుల సంఖ్య రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మన దగ్గర ప్రస్తుతం తిరుగుతున్న 2700 బస్సుల్లోనూ దాదాపు వెయ్యి బస్సులు పది లక్షల కిలో మీటర్ల తిరిగినవే. పక్కన పెట్టాల్సిన వీటికి రాజధానిలో మర్మమతులు చేసి రంగులు వేసి తిప్పుతున్నారు. నిత్యం రూ.కోటి నష్టం మూటగట్టుకునే ఆర్టీసీకి అక్కడి మాదిరిగా ఇక్కడ బస్సుల సంఖ్య పెంచడం కష్టసాధ్యంగా మారింది. ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీకి రూ.500 కోట్ల రుణం ఇప్పించినా కూడా ఆ డబ్బంతా కేవలం గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీ కింద ఇతరత్రా వాటి ఖర్చుకే సరిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అదే మార్గమని..
డీజల్‌ ధరలు భారీగా పెరిగినా కూడా ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదు. ఈసారి పెంచకతప్పని పరిస్థితి ఏర్పడిందని.. దీనికి అనుగుణంగా రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ నేతృత్వంలో సమావేశమై ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా వచ్చే ఆదాయంతో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు సర్కార్‌కు ఇచ్చిన నివేదికలో ప్రస్తుతం నగరంలో ప్రయాణికుల అవసరాలను తీర్చాలంటే వెంటనే కనీసం రెండువేల కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


నగరం బస్సులు ప్రయాణికులు (లక్షల్లో)
బెంగళూరు 6629 25.8
ముంబయి 4680 14.5
చెన్నై 5500 20
హైదరాబాద్‌ 2700 30


 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని