logo
Published : 01/12/2021 03:54 IST

‘దేశంలో రైతుల పరిస్థితి దారుణం’


కార్యక్రమంలో మాట్లాడుతున్న మోహిని మెహన్‌మిశ్రా

మేడ్చల్‌, న్యూస్‌టుడే: దేశంలో రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యదర్శి మోహిని మెహన్‌మిశ్రా అన్నారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మంగళవారం మేడ్చల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా జోగినిపల్లి శ్రీరంగరావు, ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి రాజిరెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయకార్యదర్శి మోహిని మెహన్‌మిశ్రా మాట్లాడారు. దేశంలో రైతులు మాత్రమే వారు అమ్మిన దానికి పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలో రైతుల పరిస్థితి మారలేదని వాపోయారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత ప్రచారక్‌ దేవేందర్‌జీ, రాష్ట్ర క్షేత్ర సంఘటనా కార్యదర్శి దోనారు రాములు, జాతీయ నాయకులు సాయిరెడ్డి, జాతీయ గో ఆధారిత వ్యవసాయదారులు సంఘం అధ్యక్షుడు జలపతిరావు, మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు కౌకుంట్ల రాజేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు నరేందర్‌రెడ్డి వివిధ జిల్లాల కిసాన్‌ సంఘ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని