logo
Published : 01/12/2021 03:54 IST

మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక చట్టాలు అవసరం

అవార్డులు అందుకున్న వారితో నాబార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ జి.ఆర్‌.చింతల తదితరులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఆత్మనిర్భర్‌ భారత్‌లో మహిళలు భాగస్వాములు కావాలని నాబార్డు ఛైర్మన్‌ డాక్టర్‌ జి.ఆర్‌.చింతల అన్నారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో స్వయం సహాయక బృందాలకు రెండు రోజుల కార్యశాల మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన చింతల మాట్లాడుతూ..  2030 నాటికి దేశంలో 45 కోట్ల మహిళలు సంఘాలలో చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా అభివృద్ది సొసైటీ(ఏపీమాస్‌) సీఈఓ సీఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 9 రాష్ట్రాలలో స్వేచ్ఛా సహకార చట్టాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా రుణాలను ఇవ్వడానికి నాబార్డు ముందుకు రావాలని కోరారు. ఏపీమాస్‌ ఛైర్మన్‌ కాకి మాధవరావు, ఎన్‌ఐఆర్‌డీ మాజీ డైరక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి, సేవా బ్యాంకు ఎండీ జయశ్రీ వ్యాస్‌, చైతన్య సంస్థ వ్యవస్థాపకురాలు సుధా కొఠారి, నాబార్డు విశ్రాంత డీజీఎం మోహనయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంఘాలకు నగదు బహుమతులు అందించారు. మొదటి స్థానాన్ని మహారాష్ట్రకు చెందిన క్రాంతి జ్యోతి లోకసంచాలిత్‌ సాధన్‌ కేంద్ర సమాఖ్య, రెండో స్థానాన్ని రాజస్థాన్‌కు చెందిన క్రాంతి మహిళ మంచ్‌, మూడో స్థానాన్ని రాజస్థాన్‌కు చెందిన సంఘర్ష్‌, సవేరా మహిళా మంచ్‌లు సాధించాయి.

 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని