logo
Published : 01/12/2021 03:54 IST

ధ్రువ స్పేస్‌ కంపెనీతో హైదరాబాద్‌ బిట్స్‌ ఒప్పందం

పత్రాలపై సంతకాలు చేస్తున్న బిట్స్‌ డైరెక్టర్‌ సుందర్‌, ధ్రువ స్పేస్‌ కో ఫౌండర్‌ కృష్ణతేజ

ఈనాడు, హైదరాబాద్‌: అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధిలో పరస్పరం సహకరించుకునేందుకు ధ్రువ స్పేస్‌ కంపెనీతో హైదరాబాద్‌ బిట్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉపగ్రహ సమాచార సాంకేతికత పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కృషి చేయనున్నారు. శామీర్‌పేటలోని బిట్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో   పత్రాలపై బిట్స్‌ డైరెక్టర్‌ సుందర్‌, ధ్రువ స్పేస్‌ కో ఫౌండర్‌ కృష్ణతేజ సంతకాలు చేశారు. బిట్స్‌ హైదరాబాద్‌లో నెలకొల్పిన ఎర్త్‌ స్టేషన్‌ సాయంతో డాటా రేటును ఎంబీపీఎస్‌లలో అందించడంతో పాటు సమాచార సాంకేతిక ఉపగ్రహాల పరంగా సరికొత్త సాంకేతికతలను పరీక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ధ్రువ స్పేస్‌ శాట్‌కామ్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ వేర్వేరు ఎర్త్‌ స్టేషన్లను నెలకొల్పింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో మరింత బలోపేతమవుతుందన్నారు. విద్యాసంస్థలతో కలిసి సాంకేతికతను అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని