logo
Published : 01/12/2021 03:54 IST

బాలికపై అత్యాచారం.. దోషికి 20 ఏళ్ల కారాగారం


నిందితుడు పోచయ్య

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఓ బాలికను భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం..కామారెడ్డిజిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఒడ్డె పోచయ్య ఆలియాస్‌ అశోక్‌ (21) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌లో స్థిరపడ్డాడు. 2017లో పోచయ్య ఆదిభట్ల ఠాణా పరిధిలో ఓ బాలిక(16)ను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో పోచయ్య బండారం బయటపడింది. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. అనంతరం అతడిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజు మంగళవారం తుది తీర్పు వెల్లడించారు.
 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని